సుసంపన్నమైన తెలుగు భాషా సాహిత్య చరిత్రను పోషించడం

మా గురించి

తెలుగు భాషా వైభవాన్ని పరిరక్షించి, తెలుగు కీర్తిని నలు దిశలా వ్యాపింప చేయడం ఆంధ్ర సారస్వత పరిషత్ ఉద్దేశం. సుసంపన్నమైన మన తెలుగు సాహిత్యాన్ని, సంస్కృతిని పరిరక్షించడం కోసం ఈ పరిషత్ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఆధునిక సాంకేతికత సాయంతో తెలుగు భాష ప్రాముఖ్యతను ప్రపంచమంతటికీ తెలియజేయడానికి వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. తెలుగు భాష గౌరవాన్ని నిలబెట్టేలా పరిషత్ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ముఖ్యంగా భారతదేశం, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు చిన్నారులు, యువతలో తెలుగు భాష పట్ల ప్రేమను, బాధ్యతను పెంచే కార్యక్రమాలను నిర్వహిస్తోంది. తెలుగు మాట్లాడే ప్రాంతాల్లోని కళాకారులు, రచయితల సృజ‌నాత్మ‌క‌త‌ను, ప్రతిభను వెలికితీసి ప్రపంచానికి పరిచయం చేయాలన్నది సారస్వత పరిషత్ ఆకాంక్ష. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆంధ్రప్రదేశ్ లోని భీమవరం కేంద్రంగా పని చేస్తోంది. మూడు గిన్నిస్ రికార్డులు సాధించిన ప్రముఖ గాయకుడు డాక్టర్ కేశిరాజు శ్రీనివాస్ (గజల్ శ్రీనివాస్) గారు ఈ సంస్థకు ఛైర్మన్ (అధ్యక్షుడు) గా వ్యవహరిస్తున్నారు. ఆయన సమర్థవంతమైన మార్గదర్శకత్వంలో పరిషత్ పని చేస్తోంది.

మా లక్ష్యం

తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో, ప్రపంచ వ్యాప్తంగా సుసంపన్నమైన తెలుగు సాహిత్య సంస్కృతిని పరిరక్షించి, వికాసం కోసం కృషి చేయడం.

మా ఆచరణ

సంప్రదాయ కళా రూపాలు, సాంస్కృతిక‌, సాహిత్య కార్య‌క్ర‌మాల‌ ద్వారా తెలుగు భాష గొప్పతనాన్ని వ్యాపింపచేసేందుకు ప్రయత్నించడం.

మా విధానం

తెలుగు సంస్కృతి, సాహిత్యం, సంప్రదాయాలను ప్రశంసించడం, పరిరక్షించడం, ప్రోత్సహించడం.

తెలుగు వైభవ ప్రచారం, వికాసం కోసం మాకు తోడ్పాటును ఇవ్వండి.

విరాళాలను అందించడం ద్వారా భాషా పరిరక్షణ లక్ష్యంలో మీరు భాగస్వాములు కావొచ్చు