తేనెలొలుకు తెలుగు భాష వైభవాన్ని, గౌరవాన్ని నిలబెట్టడం

సాంస్కృతిక, సాహిత్య విభాగాల్లో తెలుగు భాష గౌరవాన్ని, వైభవాన్ని మరింత బలోపేతం, అభివృద్ధి చేయడానికి ఆంధ్ర సారస్వత పరిషత్ కృషి చేస్తోంది. ఇందుకోసం అంతర్జాతీయ సదస్సులు, సాంస్కృతిక‌ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరంలోని వెస్ట్ బెర్రీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జనవరి 6-8, 2022 వరకు ఈ కార్యక్రమాలను నిర్వహించనుంది.

ఈ కార్యక్రమాలను పర్యవేక్షించడానికి, విజయవంతం చేయడానికి ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశాం. సాహిత్య వేత్తలు, కళాకారులు, తెలుగు సంఘాల ప్రతినిధులు, తెలుగు పుస్తకాల ప్రచురణ సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని వివిధ అంశాలపై చర్చిస్తారని ఆశిస్తున్నాం. మేం నిర్వహించే సదస్సులో పాల్గొని వారి విలువైన సూచనలను, సలహాలను అందిస్తారని భావిస్తున్నాం. మీరిచ్చే సూచనలు మేం సరైన మార్గంలో పయనించేందుకు అవసరమైన మార్గ దర్శకత్వాన్ని అందిస్తాయి.
ఆ మా దృష్టి అంతా సుసంపన్నమైన తెలుగు భాష వారసత్వాన్ని పరిరక్షించడం, దానికి ప్రాచుర్యం కల్పించడంపైనే ఉంటుంది. తెలుగు గౌరవాన్ని, ఖ్యాతిని నిలబెట్టిన కవి త్రయ (నన్నయ, తిక్కన, ఎర్రా ప్రగడ) స్ఫూర్తిని మనమంతా ఆదర్శంగా తీసుకుందాం.

మన గౌరవనీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రతిపాదించిన నూతన విద్యా విధానం మాకు స్ఫూర్తినిచ్చి, మన మాతృ భాష‌ను అభివృద్ధి చేసుకునే విధంగా ప్రోత్సహిస్తుందని మేం విశ్వసిస్తున్నాం. తెలుగు భాషా వికాసానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు శ్రీ వై. యెస్. జగన్ మోహన్ రెడ్డి గారు, శ్రీ కె.చంద్రశేఖర రావుల కృషి ప్రశంసనీయం. తెలుగు భాష ప్రగతికి ఆంధ్ర ప్రదేశ్ అధికారభాషా సంఘ అధ్యక్షులు డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ , తెలుగు అకాడమీ అధ్యక్షురాలు శ్రీమతి డా. నందమూరి లక్ష్మీ పార్వతి గార్లు చేస్తున్న సేవ అభినందనీయం.
అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన ప్రాచీనమైన తెలుగు భాష ప్రతి తెలుగువాడి ఇంటి గడపలో ప్రకాశించాలి. తెలుగు వారికి జ్ఞానాన్ని అందించే దేవాల‌యంగా మన మాతృ భాష‌ భాసించాలి. తెలుగు భాష వారసత్వాన్ని సమగ్ర విధానంలో పిల్లలకు వివరించడం ద్వారా, మన భాష‌ వారసత్వాన్ని వారికి అందించాలి. సుసంన్నమైన తెలుగు సంస్కృతి, సంప్ర‌దాయాల‌ విలువైన సంపదను యువ తరానికి అందించేందుకు మనం తప్పకుండా కృషి చేయాలి. మన భాషే మన సంపద…మన భాషే మనకు నిజమైన గుర్తింపు. తెలుగు భాష అభివృద్ధిలో మీ అమూల్యమైన సలహాలు ఎంతో ముఖ్యం. అలాంటి సలహాల కోసం మేం ఎదురు చూస్తూ ఉంటాం.

అంతర్జాతీయ తెలుగు సంబరాలు – కార్యక్రమ వివరాలు:

జనవరి 6, 2022

ప్రవాసాంధ్ర, ప్రవాస భారతీయ సంఘాలకు అభినందన
వేదిక: డాక్టర్స్ కాలనీ కన్వెన్షన్ హాల్, భీమవరం
(ప్రత్యేక ఆహ్వానితుల కార్యక్రమం)

జనవరి 7, 2022

ఉదయం 9 గంటలకు - సంబరాల ప్రారంభోత్సవం.
తెలుగు సాహిత్యంలోని వివిధ అంశాలపై సదస్సులు
రాత్రి 8 గంటలకు - సాంస్కృతిక కార్యక్రమాలు
వేదిక: వెస్ట్ బెర్రీ హైస్కూల్ గ్రౌండ్స్, పెదమిరం, భీమవరం

జనవరి 8, 2022

ఉదయం 9 గంటలకు – సదస్సులు
సాయంత్రం 5 గంటలకు – కార్యక్రమ ముగింపు
రాత్రి 7 గంటలకు - సాంస్కృతిక కార్యక్రమాలు
వేదిక: వెస్ట్ బెర్రీ హైస్కూల్ గ్రౌండ్స్, పెదమిరం, భీమవరం

గమనిక: కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా కార్యక్రమాలు జరుగుతాయి. కొవిడ్ కేసులు బాగా పెరిగితే కార్యక్రమాన్ని వాయిదా వేసే అవకాశం ఉంది.

సదస్సులో చర్చించే అంశాలు

ఆశీస్సులు అందజేస్తున్నవారు

గౌరవాధ్యక్షులు

శ్రీ సిహెచ్.రంగనాథ రాజు, గౌరవ గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు
శ్రీ గ్రంధి శ్రీనివాస్, ఎమ్మెల్యే
శ్రీ మంతెన రామరాజు, ఎమ్మెల్యే

డాక్టర్ కేశిరాజు శ్రీనివాస్ (గజల్)

అధ్యక్షుడు
ఫోన్: 9849013697
drghazalsrinivas@gmail.com

శ్రీ రాయప్రోలు భగవాన్

ప్రధాన కార్యదర్శి
ఫోన్: 9848144009

కార్యాలయ ప్రారంభకులు

శ్రీ విశ్వనాథ రాజు
ఛైర్మన్, ఆంధ్రా గ్రూప్

లోగో ఆవిష్కరణ

శ్రీ పాకలపాటి సర్రాజు, అధ్యక్షులు
క్షత్రియ కార్పొరేషన్, ఆం.ప్ర. ప్రభుత్వం

వేదిక, స్థలం

భీమవరం పట్టణంలో గల స్థానిక వసతి సౌకర్యాలు

శ్రీ ప్రణమ్స్ ఇంటర్నేషనల్

భీమవరం, నగరం మధ్య నుంచి 0.9 కి.మీ

కోసీ వరల్డ్ రిసార్ట్స్

కాకినాడ, భీమవరం నుంచి 8.3 కి.మీ

సుశీల్స్ నెస్ట్

భీమవరం, నగరం మధ్య నుంచి 2.0 కి.మీ

దగ్గర్లోని విమానాశ్రయాలు

రాజమండ్రి

భీమవరం నుంచి 70.8 కి.మీల దూరం

విజయవాడ

భీమవరం నుంచి 77.4 కి.మీల దూరం

విశాఖపట్నం

భీమవరం నుంచి 284.5 కి.మీల దూరం

భీమవరానికి దగ్గర్లో చూడదగ్గ ప్రదేశాలు

తాడేపల్లిగూడెం

భీమవరం నుంచి 31.1 కి.మీల దూరం

తణుకు

భీమవరం నుంచి 39.9 కి.మీల దూరం

పాలకొల్లు

భీమవరం నుంచి 23.2 కి.మీల దూరం

రాజమండ్రి

భీమవరం నుంచి 90.5 కి.మీల దూరం

అన్నవరం

భీమవరం నుంచి 169.9 కి.మీల దూరం

నరసాపురం

భీమవరం నుంచి 30.9 కి.మీల దూరం

దగ్గర్లోని ఆకర్షణీయ ప్రదేశాలు

పేరుపాలెం సముద్ర తీరం

భీమవరం నుంచి 34.4 కి.మీల దూరం

గోదావరి నది

భీమవరం నుంచి 71.0 కి.మీల దూరం

కొల్లేరు సరస్సు

భీమవరం నుంచి 45.6 కి.మీల దూరం

భీమవరానికి దగ్గర్లోని ప్రసిద్ధ దేవాలయాలు

ద్వారకా తిరుమల దేవాలయం

ద్వారకా తిరుమల, భీమవరం నుంచి 71.8 కి.మీల దూరం

శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి దేవాలయం

గునుపూడి, భీమవరం నుంచి 1.9 కి.మీల దూరం

ఇస్కాన్ దేవాలయం

రాజమండ్రి, భీమవరం నుంచి 77.1 కి.మీల దూరం

క్షీర రామలింగేశ్వర స్వామి దేవాలయం

పాలకొల్లు, భీమవరం నుంచి 23.5 కి.మీల దూరం

శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవాలయం

భీమవరం బస్టాండ్ నుంచి 700 మీటర్ల దూరం

శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవాలయం

జంగారెడ్డి గూడెం, భీమవరం నుంచి 77.1 కి.మీల దూరం

విరాళాలు

తెలుగు విలువను పెంపొందించడంలో మాకు చేయూతను ఇవ్వండి.

మీ విరాళాల ద్వారా మా కార్యక్రమాలను ప్రోత్సహించాలనుకుంటే, దయచేసి మీ విరాళాలను క్రింది బ్యాంక్ అకౌంట్ కు పంపండి.
పేరు : ఆంధ్ర సారస్వత పరిషత్
అకౌంట్ నెంబర్ : 921010041078788
ఐఎఫ్ఎస్ సి (IFSC): UTIB0000217
యాక్సిస్ బ్యాంక్ గునుపూడి శాఖ,
భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా,
ఆంధ్రప్రదేశ్ – 534202
పేరు – రాయప్రోలు భగవాన్
ఫోన్ నెం : 9848144009

రిజిస్ట్రేషన్

ఈ సదస్సులో పాల్గొనేందుకు దయ చేసి మీ పేరు రిజిస్టర్ చేసుకోండి.


    *తపాల ద్వారా 15 రోజుల్లోపు మీకు రశీదు పంపిస్తాం.